Czytaj książkę: «కోపాన్ని నిగ్రహించుకోవడం»

Czcionka:

Table of Contents

  Copertina

  విషయ సూచిక

  కోపాన్ని నిగ్రహించుకోవడం

  ‘కోపాన్ని నిగ్రహించుకోవడం’ అనే ఈ ఈబుక్‌ను కొనుగోలు చేసినందుకు మీకు మా ధన్యవాదాలు.

  విషయ సూచిక

  కోపాన్ని నిగ్రహించుకోవడం గురించి.

  కోపం నిగ్రహించుకోవడం

  కోపం నిగ్రహించుకోడానికి పాఠాలు

  కౌమార దశ కోపం నిగ్రహించుకోవడం

  కోపం నిగ్రహించుకోవడంలో పుస్తకాలు

  కోపం నిగ్ర కొరకు శీర్షికలు

  కోపం నిగ్రహించుకొనే చిత్రాలు

  పిల్లలు కోపం నిగ్రహించుకోవడం

  కోపం నిగ్రహించుకోడానికి సహాయం

  కోపం నిగ్రహించుకోవడంలోనిపుణత

  కోపం నిగ్రహించుకొనే నైపుణ్యాలు

  కోపం నిగ్రహించుకోవడం మరియు గృహ హింస

  ఒత్తిడితో కూడిన పరిస్థితులలో కోపం నిగ్రహించుకొనే చిట్కాలు

  ఉచిత కోపం నిగ్రహించుకొనే సలహా ఎక్కడ దొరుకుతుంది

  పని చేసే కోపం నిగ్రహించుకొనే నైపుణ్యాలను స్వీకరించడం

కోపాన్ని నిగ్రహించుకోవడం

కోపం మరియు నిరాశను నియంత్రించడం

రచయిత్రి

1 ఓవెన్ జోన్స్

అనువాదకుడు:

1 గొట్టుముక్కల మార్టిన్ లూథర్

మేగాన్ పబ్లిషింగ్ సర్వీసెస్ ద్వారా ప్రచురించబడింది

http://meganthemisconception.com

కాపీరైట్ ఓవెన్ జోన్స్ 2021 ©

‘కోపాన్ని నిగ్రహించుకోవడం’ అనే ఈ ఈబుక్‌ను కొనుగోలు చేసినందుకు మీకు మా ధన్యవాదాలు.

ఈ సమాచారం మీకు సహాయకరంగా, ఉపయోగకరంగా మరియు లాభదాయకంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను.

ఈ ఈబుక్‌లోని సమాచారం కోపం నిగ్రహించుకోవడానికి సంబంధించిన వివిధ అంశాలు మరియు విషయాలను 15 అధ్యాయాలుగా విభజించబడింది మరియు ఒక్కొక్క అధ్యాయంలో 500-600 పదాలున్నాయి.

కోపం నిర్వహణ గురించి లేదా వారి నిగ్రహాన్ని నియంత్రించడం గురించి మరింత తెలుసుకోవాలనుకునే వారికి ఇది ఆసక్తిని కలిగిస్తుందని నేను ఆశిస్తున్నాను.

అదనపు బోనస్‌గా, మీ స్వంత వెబ్‌సైట్‌లో లేదా మీ స్వంత బ్లాగులు మరియు వార్తాలేఖలో కంటెంట్‌ను ఉపయోగించడానికి నేను మీకు అనుమతిస్తున్నాను, అయినప్పటికీ మీరు వాటిని మీ స్వంత మాటలలో తిరిగి వ్రాస్తే మంచిది.

మీరు పుస్తకాన్ని విభజించి, కథనాలను తిరిగి అమ్మవచ్చు. వాస్తవానికి, ఈ పుస్తకాన్ని మీకు పంపిణీ చేసినట్లుగా తిరిగి అమ్మడం లేదా ఇవ్వడం మీకు లేని ఏకైక హక్కు .

మీకు ఏమైనా అభిప్రాయం ఉంటే, దయచేసి మీరు ఈ పుస్తకాన్ని కొనుగోలు చేసిన సంస్థకు తెలియజేయండి.

ఈ ఈబుక్ కొనుగోలు చేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు,

ఇట్లు,

ఓవెన్ జోన్స్

1  విషయ సూచిక

కోపం నిగ్రహించుకోవడం గురించి.

కోపం నిగ్రహించుకోవడం

కోపం నిగ్రహించుకోవడానికి పాఠాలు

కౌమార కోపం నిగ్రహించుకోవడం

కోపం నిగ్రహించుకోవడానికి పుస్తకాలు

కోపం నిగ్రహించుకోవడం వ్యాసాలు

కోపం నిగ్రహించుకోవడం చిత్రాలు

పిల్లలు కోపం నిగ్రహించుకోవడం

కోపం నిగ్రహించుకోవడానికి సహాయం

కోపం నిగ్రహించుకొనే పద్ధతులు

కోపం నిగ్రహించుకోవడంలో నైపుణ్యాలు

కోపం నిగ్రహించుకోవడం మరియు గృహ హింస

ఒత్తి పరిస్థితులలో కోపం

నిగ్రహించుకోవడానికి చిట్కాల

కోపం నిగ్రహించుకోవడానికి ఉచిత సలహా ఎక్కడ దొరుకుతుంది

కోపం నిగ్రహించుకోవడంలో ఆచరణ యోగ్యమైన నైపుణ్యాలను ఆచరించడం

కోపాన్ని నిగ్రహించుకోవడం గురించి.

కోపం నిగ్రహించుకోవడం గురించి ఆలోచించేటప్పుడు, భావోద్వేగాలను గూర్చిన లోతైన అవగాహన పొందడానికి మరియు కోపం నిగ్రహించుకునే పరిష్కార మార్గాలను వర్తింపజేయడానికి కృషి చేయడంలో కోపం మరియు దూకుడును నిశితంగా పరిశీలించడం విలువైనది.

తరచుగా, ఎవరైనా నిరాశను అనుభవించినప్పుడు, వారి భావోద్వేగాలు ప్రేరేపించినప్పుడు వారు బద్ధలైపోతారు. అయితే, రాత్రికి రాత్రే నిరాశ అనేది ఏర్పడదు; బదులుగా, అంతర్లీన సమస్యలు బయటకు వచ్చినప్పుడు నిరాశ సంభవిస్తుంది. అందువల్ల, నిరాశ అనేది లోతైన, నమ్మకం లేని భావం లేదా అవసరాలు మరియు కోరికలు తీరనప్పుడు లేదా పరిష్కరించబడని మనోవేదనలు లేదా విశ్వాసం లేకపోవడం మరియు అసంతృప్తి నుండి ఉత్పన్నమవుతుంది.

కోపం, ఒక వ్యక్తి అతను లేదా ఆమె అనుకున్నది జరగనప్పుడు, లేదా నిద్రాణమైన సమస్యల పరంపర, కోపాన్ని వెళ్లగ్రక్కే సమయం కోసం ఎదురుచూస్తున్నప్పుడు, చివరికి అది బయటకు వచ్చినప్పుడు కలిగే అనుభూతి. దూకుడు అనేది మరొక వ్యక్తిపై ఆధిపత్యం చెలాయించే శక్తివంతమైన చర్య లేదా పద్ధతి.

దూకుడు అనేది ముఖ్యంగా నిరాశతో ప్రేరేపించబడినప్పుడు చేసే ఒక వాదన, అలాగే హానికరమైన లేదా విధ్వంసక ప్రవర్తన. మీ జీవితం ప్రమాదంలో ఉంటే దూకుడు మంచిది, కానీ చాలా సందర్భాలలో దూకుడు హాని కలిగిస్తుంది.

మరోవైపు నిశ్చయత అనేది గాయం, విధ్వంసం లేదా వాదనకు గురికాకుండా మీ భావాలను మరొక వ్యక్తికి సమర్థవంతంగా తెలియజేసే ఒక రూపం. నిశ్చయత అనేది మనలో ఉన్న బలమైన, ధైర్యమైన, నమ్మకమైన గుణం, ఇతరులు మనలను హరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మన హక్కులను కాపాడుకోవడానికి ఇది సహాయపడుతుంది.

దూకుడు మరియు నిశ్చయత మధ్య వ్యత్యాసాన్ని గూర్చి మనం నేర్చుకుంటే, మనం మంచి ప్రవర్తనా సరళిని నేర్చుకుంటాము, అదే సమయంలో, మన జీవితాలను నియంత్రించుకుంటూ మరియు భవిష్యత్తులో సమస్యలను నివారిస్తాము.

మీరు నిరాశను అనుభవిస్తుంటే, మీరు మీ మనస్సులోని మీ నమ్మకాలు, అభిప్రాయాలు, సిద్ధాంతాలు, తార్కికం మొదలైన ఇష్టంలేకపోయినా వాటినే అంగీకరించాలని కోరుకోవచ్చు. . మీకు కోపం తెప్పించే మూలాలను సమీక్షించడం ద్వారా, మీరు కోపం రావడం చూసినప్పుడు ఉద్రిక్తతను తగ్గించవచ్చు; మీ చిరాకుకు కారణాలు మీ నియంత్రణలో లేనందున కోపం తెచ్చుకోవడం విలువైనది కాదని మీరు గ్రహిస్తారు.

ఉదాహరణకు, మిమ్మల్ని మీరు విశ్లేషించుకున్నప్పుడు, మీరు మరొక దృక్కోణాన్ని చూడవచ్చు మరియు మీకు నిరాశ లేదని తేల్చవచ్చు. ఈ వ్యూహాలన్నీ కోపాన్ని నిగ్రహించుకోవడం గురించే.

మీకు చెడు చేసిన వ్యక్తిపై తీసుకునే దృఢమైన చర్య, ఫ్యూజ్ కాలిపోవడం కంటే చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ ప్రతిచర్య కారణంగా, కోపం నిగ్రహించుకోవడం గురించి, ఒక వ్యక్తి తన కోపాన్ని ఎలా కోల్పోతాడో మరియు అతను లేదా ఆమె ఎదుర్కోవాల్సిన పరిణామాలు ఏమిటో మనం ఒక ఉదాహరణ ద్వారా చూడవచ్చు.

ఉదాహరణకు, ఇద్దరు వ్యక్తులు వాదించుకుంటున్నారు మరి, గొడవ మొదలైంది. వారిలో ఒకరు మరొకరి గురించి అబద్ధాలు ప్రచారం చేశారని ఆరోపించారు. తరువాత అది హింసాత్మక గొడవగా మారుతుంది, అది చూసిన పొరుగువారు పోలీసులను పిలుస్తారు. పోలీసులు వచ్చినప్పుడు, ఇద్దరికీ సంకెళ్ళు వేసి జైలుకు తీసుకువెళ్తారు.

వారి సమస్యలు పెరిగాయి ఎందుకంటే

వారిద్దరూ జరిమానాలు, కోర్టు ఖర్చులు మరియు పరిశీలన రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి, ఒక సమస్య అనేక ఇతర సమస్యలకి దారితీసింది కాని అది అంతటితో ఆగిపోదు. ఈ ఇద్దరూ వారి జరిమానాలు, ఖర్చులు మరియు అన్నింటినీ చెల్లించినప్పుడు, అది పోలీసు రికార్డుల్లోకి

వెళ్తుంది, తద్వారా ప్రతి ఒక్కరూ జీవితాంతం వారిని అపరిపక్వ వ్యక్తులుగా పరిగణిస్తూ, నమ్మకంలేని హింసాత్మక వ్యక్తులుగా తీర్పు ఇస్తారు.

కోపం నిగ్రహించుకోనే విషయంలో ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం, ఈ దృష్టాంతంలో నొక్కిచెప్పడం అనేది ఉపయోగించబడింది. ఒక వ్యక్తి మరొక వ్యక్తి గురించి పొరుగువాళ్ళతో అబద్ధాలు వ్యాప్తి చేసిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎదుర్కొంటారు.

పుకార్లకు గురైన వ్యక్తి తన స్నేహితుడి వద్దకు వెళ్ళి ఇలా అడిగాడు: 'నాకు తాగుడు సమస్య ఉందని

మీరు ప్రజ

లకు ఎందుకు చెబుతున్నారు?'. అవతలి వ్యక్తి, 'మీకు మద్యపాన సమస్య

ఉందని నేను ఎవరికీ చెప్పలేదు' అని అంటాడు. 'తప్పు!', అని అంటూ, 'మీరు అబద్దాలు

చెప్పని

నా బెస్ట్ ఫ్రెండ్ కి చెప్పారు' అని మొదటి వ్యక్తి అంటాడు. 'సరే, నేను మీ ఇంటికి వచ్చిన ప్రతిసారీ మీరు తాగుతున్నందున మీకు తాగుడు సమస్య ఉందని నేను అనుకున్నాను'.

'మీరు నా ఇంటికి వచ్చిన ప్రతిసారీ నేను

తాగుతు

న్నాను కాబట్టి నాకు సమస్య ఉందని కా

దు. నా పేరుమీద బురద చల్లడానికి మిమ్మల్ని నేను అనుమతించను మరియు మీరు నా గురించి అబద్ధాలు చెబుతూ ఉంటే, నా ఇంటికి మళ్ళీ రావడానికి నేను మిమ్మల్ని అనుమతించను. స్నేహితులెవ్వరూ తమ స్నేహితులను బాధించరు. కాబట్టి, మీకు నాతో ఏమైనా సమస్యలు ఉంటే, వాటిగురించి నా వెనుక మాట్లాడే బదులు వాటిని నాతో మాట్లాడండి '.

ఎంత మంచి ఫలితమో కదా!

ఈ వ్యక్తి తన గురించి తాను నొక్కిచెప్పి ఒక మంచి పని చేసాడు మరియు ఫలితాలు ఖచ్చితంగా విజయవంతమవుతాయి. తరువాత ఏమి జరుగుతుందో చూద్దాం. '

నన్ను నిజంగా క్షమించు; నిన్ను బాధపెట్టాలని నా ఉద్దేశ్యం కాదు. నాకు మీతో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈసారి మీతో మాట్లాడతాను. అయినప్పటికీ, నేను మీ ఇంటివైపు వచ్చే ప్రతిసారీ మీరు త్రాగటం వలన మీకు మద్యపాన సమస్య ఉందేమో అని నేను ఇప్పటికీ ఆందోళన చెందుతున్నాను '. 'సరే, మా ఇంటికి వెళ్లి విషయం చర్చించుకుందాం'.

తేడా నాటకీయంగా ఉంది, కాదంటారా? మరి ఇలా ఎందుకు జరిగిందంటే కోపం నిగ్రహించుకోవడాన్ని గురించి వాళ్ళల్లో ఒకరు ఆలోచించారు!

Darmowy fragment się skończył.

399 ₽
32,98 zł
Ograniczenie wiekowe:
0+
Data wydania na Litres:
22 kwietnia 2021
Objętość:
38 str.
ISBN:
9788835422440
Właściciel praw:
Tektime S.r.l.s.
Format pobierania:
Tekst, format audio dostępny
Średnia ocena 4,7 na podstawie 302 ocen
Audio
Średnia ocena 4,2 na podstawie 743 ocen
Tekst, format audio dostępny
Średnia ocena 4,8 na podstawie 91 ocen
Tekst, format audio dostępny
Średnia ocena 4,4 na podstawie 49 ocen
Audio
Średnia ocena 4,7 na podstawie 28 ocen
Audio
Średnia ocena 4,8 na podstawie 80 ocen
Tekst, format audio dostępny
Średnia ocena 4,8 na podstawie 17 ocen
Tekst
Średnia ocena 0 na podstawie 0 ocen
Tekst
Średnia ocena 0 na podstawie 0 ocen
Tekst
Średnia ocena 0 na podstawie 0 ocen
Tekst
Średnia ocena 0 na podstawie 0 ocen
Tekst
Średnia ocena 0 na podstawie 0 ocen
Tekst
Średnia ocena 3 na podstawie 1 ocen
Tekst
Średnia ocena 0 na podstawie 0 ocen
Tekst
Średnia ocena 0 na podstawie 0 ocen
Tekst
Średnia ocena 0 na podstawie 0 ocen
Tekst
Średnia ocena 0 na podstawie 0 ocen